Donald Trump: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో త్వరలో సమావేశం అవుతానని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తప్పకుండా.. అతడికి నేనంటే ఇష్టం.. కిమ్ చాలా స్మార్ట్ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక, దక్షిణ కొరియా, అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని ఇటీవల ఉత్తర కొరియా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ ఈ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమపై దాడికి పాల్పడితే ఎదుర్కోవడానికి అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నట్లు ప్యాంగ్‌యాంగ్ గత కొన్నాళ్ల క్రితం వార్నింగ్ ఇచ్చింది.
Read Also: Spirit : ‘స్పిరిట్’ లో వరుణ్ తేజ్ విలన్ న్యూస్ ఫేక్.. కానీ గుడ్ న్యూస్?
ఇక, 2019లో వియత్నాంలో డొనాల్డ్ ట్రంప్ కిమ్ జోంగ్ ఉన్ తో సమావేశం అయ్యారు. ఆ భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో నార్త్ కొరియా వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. దీంతో జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. తాజాగా, అమెరికా విషయంలో ప్యాంగ్‌యాంగ్ వైఖరిని మరింత కఠినంగా మార్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి వ్యక్తిగత దౌత్యాలు నడపొద్దని కిమ్ నిర్ణయించారు.
Read Also: Minister Kishan Reddy: విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం
అయితే, ఉభయ కొరియాల మధ్య కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతుంది. గతేడాది వరుసగా ప్యాంగ్యాంగ్ క్షిపణి పరీక్షలు చేస్తుండటంతో పాటు చెత్త బెలూన్లు పంపడం లాంటి కవ్వింపు చర్యలతో సియోల్‌తో సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గత ప్రభుత్వంలో అమెరికా విదేశాంగ మంత్రిగా పని చేసిన ఆంటోని బ్లింకెన్ దక్షిణ కొరియాలో పర్యటించగా.. అదే సమయంలో తూర్పు సముద్రంలోకి కిమ్ సేన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.