ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు వర్షం కురిపించారు. వివేక్ తనకు బాగా తెలుసని.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనిడాయారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటి రోజే పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను పాస్ చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణ, బర్త్ రైట్ పౌరసత్వం వంటి వాటిపై ఉత్తర్వులు జారీ చేశారు.
Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన అనేక ముఖ్యమైన నియామకాలను కూడా ప్రకటించారు. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. మస్క్ ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాలతోనే స్నేహం చేస్తున్న డోనాల్డ్ పై ఒక ఫేమస్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు చేసింది.