Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాలతోనే స్నేహం చేస్తున్న డోనాల్డ్ పై ఒక ఫేమస్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మీడియా ముందు చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఈ వార్త అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరు ఆ రచయిత్రి..? ఏం జరిగింది..? అని అంటే.. ఆమె పేరు జీనో కారల్.. ఎంతో మంచి పుస్తకాలను రచించి ఫేమస్ అయ్యింది. ఇక ఇటీవలే ఆమె తన కొత్త పుస్తకాన్ని పబ్లిష్ చేసి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆమె ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేసింది.
“1996 లో నేను బెర్గడోర్ఫ్ గుడ్ మ్యాన్ స్టోర్ లో పనిచేస్తున్నప్పుడు ట్రంప్ నాకు పరిచయమయ్యాడు.. ఆ తరువాత కొద్దిరోజుల పరిచయం తరువాత అతడు నాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. నేను వద్దు అని చెప్పినా కూడా అతడు వినలేదు. ఆ సంఘటన తర్వాత నేను చాలా కుంగిపోయాను. ఆ మానసిక క్షోభకు ప్రతీకారంగా అతడిపై కోర్టులో దావా వేస్తున్నాను. నవంబర్ 24 న నా తరపు న్యాయవాది రాబర్టా కోర్టులో దావాను దాఖలు చేయనున్నాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు అమెరికాను షేక్ చేస్తున్నాయి. ఇక జీనో వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ ” ఆమె చెప్పిన మాటల్లో ఎలాంటి నిజం లేదు.. ఆమె రిలీజ్ చేసే పుస్తకం ప్రమోషన్స్ కోసం ఇలాంటి చెత్త పనులు, చెత్త ఆరోపణలు చేస్తోంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఇందులో నిజానిజాలు ఏంటి అనేది కోర్టులో తెలియనున్నవి.