Eric Trump: ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. మమ్దానీపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయులను ద్వేషిస్తాడు’’ అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్‌స్టీన్’’ ఫైల్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్లు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు అన్ని నిజాలు బయటపడుతాయని ట్రంప్ అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 427 మంది అనుకూలంగా, ఒక్కరు వ్యతిరేకంగా ఓటేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ముద్ర పడిన అల్ షరా ఇప్పుడు సిరియా దేశాధినేత. ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.
US Politics: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ-అమెరికన్లు విజయకేతనం ఎగరవేశారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీకి చెందిన భారత సంతతికి ముస్లిం వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ (34) చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఓడించి అమెరికాలోని అత్యంత సంపన్న నగరంలో నయా చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరం అయిన న్యూయార్క్‌కు ముస్లిం మేయర్‌గా కూడా ఆయన రికార్డు సృష్టించారు. READ ALSO: AP News: ఏపీ…
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని…
No Kings protests: అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ‘‘ నో కింగ్స్’’ అనే పేరుతో ప్రజలు నిరసనలు నిర్వహిస్తున్నారు. శనివారం న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్‌ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.
Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు, మేక్ అమెరికా గ్రేట్ అగెన్(MAGA) క్యాంపెన్‌ను నిర్వహించిన రిపబ్లికన్ మద్దతుదారు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చార్లీ కిర్క్‌కు పేరుంది.
Charlie Kirk: హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు, మద్దతుదారు చార్లీ కిర్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉటా యూనివర్సిటీలో కిర్క్‌ను ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. క్యాంపస్‌లోని సోరెన్సెన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన డిబేట్ సమయంలో హత్యకు గురయ్యారు. మరణానంతరం ట్రంప్ కిర్క్‌కి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.