USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిని బలవంతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలోని గురుద్వారాలలో అక్రమ వలసదారుల్ని వేటాడుతున్నారు. అయితే, ఈ చర్యల్ని అనేక సిక్కు సంస్థలు విమర్శిస్తున్నాయి. ఇది తమ మతపరమైన స్థలాల పవిత్రతకు ముప్పుగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అమెరికా వ్యా్ప్తంగా ఇండియాకు, ఇండియన్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైంది. దీనిపై ఎలాన్ మస్క్ మాజీ ప్రేయసి, ప్రముఖ కెనడియన్ సింగర్ గ్రిమ్స్ స్పందించారు. భారతీయులకు మద్దతుగా ఆమె నిలిచారు. స్వయంగా తాను ఒక భారతీయ కుటుంబంలో పెరిగినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో భారత వ్యతిరేక పోస్టులపై స్పందిస్తూ..