Grimes: డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ లోపే సొంత పక్షంలోని మద్దతుదారుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీ, ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు కరుడుగట్టిన ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఇమ్మిగ్రేషన్లకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. అమెరికా గ్రేట్ అవ్వాలంటే, నైపుణ్యం కలిగిన వారిని హైర్ చేసుకోవాలని మస్క్ సూచిస్తుండగా, అమెరికాలోనే నాణ్యమైన నిపుణులు ఉన్నారంటూ ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు.
ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైట్‌హౌజ్ సీనియర్ పాలసీ సలహాదారుగా వెంటర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ని తీసుకోవడం వివాదంగా మారింది. గతంలో నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డులపై ఉన్న పరిమితులను తొలగించాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. దీనిపై ఇప్పుడు ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
Read Also: Joe Biden: మన్మోహన్ సింగ్‌కి నివాళి అర్పించిన అమెరికా అధ్యక్షుడు..
ఈ నేపథ్యంలోనే అమెరికా వ్యా్ప్తంగా ఇండియాకు, ఇండియన్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైంది. దీనిపై ఎలాన్ మస్క్ మాజీ ప్రేయసి, ప్రముఖ కెనడియన్ సింగర్ గ్రిమ్స్ స్పందించారు. భారతీయులకు మద్దతుగా ఆమె నిలిచారు. స్వయంగా తాను ఒక భారతీయ కుటుంబంలో పెరిగినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో భారత వ్యతిరేక పోస్టులపై స్పందిస్తూ… ‘‘అకాస్మత్తుగా ఎక్కడా లేని భారతీయ వ్యతిరేకత ఇబ్బందికరంగా ఉంది. దీనిని ప్లాన్ చేసి చేస్తున్నారు’’ అని అన్నారు.
నా సవతి తండ్రి ఒక భారతీయుడు అని, నా బాల్యం భారతీయ సంస్కృతిలో గడిచిందని చెప్పారు. భారతీయ కల్చర్, వెస్ట్రన్ కల్చర్‌కి చక్కగా కలిసిపోతుందని అన్నారు. గ్రిమ్స్ అసలు పేరు క్లైర్ బౌచర్. కెనడాలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె తల్లి వాంకోవర్‌లోని ఈస్ట్ ఇండియా కార్పెట్స్ డైరెకర్టర్ రవి సిద్ధూని వివాహ చేసుకున్నారు.