జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా…
యూపీఏ, ఎన్డీఏ పాలనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగింపు సమయానికి ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణ కోసం ఓటర్లు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
White Paper on Economy:అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రధాని మోడీ కాంగ్రెస్ తీరుపై సంచలన విమర్శలు చేశారు. తాజాగా గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. యూపీఏ ప్రభుత్వం, ఎన్డీయే ప్రభుత్వ పనితీరును పోల్చారు. 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిందని, 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సంక్షోభాలను డాక్యుమెంట్‌లో…
కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్‌లో పర్యటించారు. ఝంజర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై విరుచుకుపడ్డారు. బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ బాధ్యులని విమర్శించారు.
పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.