ప్రొ.హరగోపాల్‌తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. గెలిచేది ఎవరు? మళ్లీ ప్రధాని అయ్యేది ఎవరు? అంటూ ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఒపీనియన్ పోల్ నిర్వహించింది… ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.. ఉన్నట్టుండి ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు…
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఇప్పుడు తన ఆరాధ్యుడు నందమూరి తారక రామారావును గుర్తుచేస్తున్నారు. ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించింది. అదే ఏడాది మే 28న తన పుట్టిన రోజు నాడు విజయవాడలో విపక్షాలతో మహా రాజకీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్యకూటమి ప్రయత్నాలకు అది మరో ఆరంభం. 1983లోనే కర్నాటకలో రామకృష్ణ హెగ్డే సారధ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం…
పంజాబ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ ఎవరు అధికారం చేపడతారు అన్నతి ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన తరువాత అమరీందర్ సింగ్ డైరెక్ట్‌గా సిద్ధూను విమర్శించారు. పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని చెప్పడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక పంజాబ్ రాజకీయాలపై యూపీఏ కూటమిలోని పార్టీలు పలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి…
పెట్రో ధరలు దేశవ్యాప్తంగా సామాన్యులకు భారంగా మారిపోయాయి.. క్రమంగా ఆ ధరల ప్రభావం అన్ని వస్తువులపై పడుతూనే ఉంది.. అయితే, పెట్రోల్, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే సమయంలో.. ఏడేళ్ల క్రితం అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను…