ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడ భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్ పని చేయలేదు. అత్యవసర లైట్లు…
ఇప్పటికే అతగాడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ, పాడుబుద్ధి మరో పెళ్లి చేసుకోవాలని చూశాడు.. కానీ, పిల్లల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది… పెళ్లికి సిద్ధమైన తండ్రిని పట్టుకుని చితకబాదారు.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాని వధువు.. అక్కడి నుంచి మెల్లెగా జారుకుంది… ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. రోడ్డు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు.. మొదటి భార్యకు…
కొన్ని విచిత్రమైన పోటీలు ఉంటాయి.. వాటి వెనుక పబ్లిసిటీ స్టంటే ఉంటుంది.. తాజాగా, ఓ స్వీట్ షాపు నిర్వహకుడు ఓ భారీ సమోసా తయారు చేయించాడు.. దానికి సైజుకు తగ్గట్టుగానే ‘బాహుబలి’గా నామకరణం చేశాడు.. ఇక, ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేల బహుమతి ప్రకటించాడు.. అయితే, ఎక్కడైనా షరతులు ఉంటాయి కదా.. ఆ సమోసా తినడానికి కూడా కొంత టైం కేటాయించాడు.. అయితే, ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. ఈ దెబ్బతను…
దేశంలో ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ లో నలుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తను గర్భం దాల్చాలని తెలిసి నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు మహిళ ఆరోపించింది. దీంతో తీవ్ర గర్భస్రావం అయింది. ఈ ఘటనపై 24 ఏళ్ల బాధిత మహిళ దియోబంధ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. …
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమాజ్ వాదీ పార్టీని నిందించారు. యూపీలో బీజేపీ గెలుపుకు కారణం ఎవరని ప్రశ్నించారు. తాజాగా నిన్న జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సమాజ్ వాదీ పార్టీ, బీజేపీని ఓడించలేదని.. వారికి నిజాయితీ లేదని విమర్శించారు. ఇటాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీ కమ్యూనిటీ ఓట్లు వేయకూడదని ఆయన అన్నారు. బీజేపీ…
సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ పిద్ధాంతాలను ఒంట బట్టించుకున్న డా.కె.లక్ష్మణ్ సుదీర్ఘకాలం బీజేపీ కోసం పనిచేశారు. గతంలో బీజేపీ తరఫున ముషీరాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి దక్కింది. యూపీ నుంచి ఆయనకు బీజేపీ పెద్దల సభకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గతంలో జీవీఎల్ నరసింహారావుకి యూపీ నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చింది బీజేపీ. తాజాగా…
యూపీలోని హాపూర్ జిల్లా ధౌలానాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మృతిచెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని…
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం, పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకు యోగీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో నైట్ షిఫ్ట్ లో మహిళలు ఎవరూ పని చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా కార్మికులను పని చేయించుకోవద్దని ఆదేశించింది. మహిళల సొంత అనుమతితోనే పని చేసేలా ప్రభుత్వ సర్క్యులర్ ని…