ఓ ఎంపీకి ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఆయన్ని దోమ కుట్టింది. రైలు సిబ్బందికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆ రైలు ఆగిపోయింది. రైలు ఆపేసిన సిబ్బంది ఆదరాబాదగా ఎంపీ దగ్గరకు వచ్చి బోగీ మొత్తం క్లీన్ చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి రైలు తిరిగి బయలుదేరింది. ఎంపీనే కాదు సాధారణ ప్రయాణికుల్ని కూడా రైల్లో దోమలు కుడుతుంటాయి. కానీ సిబ్బంది పట్టించుకుంటారా.. అబ్బే అంత సీన్ ఉండదు. కానీ ఆయన ఎంపీ.. పైగా అధికార పార్టీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అందుకే సిబ్బంది అంత హడవిడి చేశారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటే ఉత్తర ప్రదేశ్ లోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్ వీర్ సింగ్. ఆయన ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న గోమతి ఎక్స్ ప్రెస్ లోని ఏసీకోచ్ లో ప్రయాణిస్తున్నారు.
Also Read : Kakani Govardhan Reddy: జగనన్నే మా భవిష్యత్తుకి విశేష స్పందన
ఈ క్రమంలో ఎంపీ రాజ్ వీర్ సింగ్ ను దోమలు కుట్టాయి. ఆయనకు నిద్రాభంగం కలిగింది. దీంతో ఆయన అనుచరుడు మాన్ సింగ్ కు బాధేసింది. అయ్యో మాసార్ని దోమలు కుట్టాయి నిద్ర పోకుండా చేశాయని ఫీల్ అయిపోయి ఆ విషయాన్ని ట్వి్ట్టర్ లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది అని ట్వి్ట్ చేశాడు. అంతే రైల్వే అధికారులు అగమేఘాల మీద స్పందించారు. ఉన్నావ్ స్టేషన్ లో రైలు ఆపి ఎంపీ రాజ్ వీర్ సింగ్ ప్రయాణించే బోగీ మొత్తం దగ్గరుండి మరీ శుభ్రం చేయించారు. స్ప్రే చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. ఇలా ఎంపీ విషయంలోనే కాదు.. మా ఫిర్యాదులకు కూడా ఇలాగే స్పందిస్తే బాగుంటుందని ప్రయాణీకులు ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : Bihar : 40 మంది మహిళలకు ఒక్కడే భర్త