వచ్చే ఏడాది దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది బీజేపీ. దీనికోసం పావులు కదుపుతున్నది. ఎలాగైనా మెరుగైన స్థానాల్లో విజయం సాధించి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. అటు బీఎస్పీ కూడా పావులు కదుపుతోంది. అయితే, దేశంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పార్టీల్లో ఒకటి ఎంఐఎం ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ లో…
ప్రధాని మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించబోతున్నారు. భారత్ వాయుసేనకు చెందిన సీ 130 జె సూపర్ హెర్క్యులస్ విమానంలో ఎక్స్‌ప్రెస్ వే పై దిగనున్నారు. అనంతం ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేస్తారు. 340 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిపై అక్కడక్కడా వాయుసేన విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే లను నిర్మించారు. Read: నవంబర్ 16, మంగళవారం దినఫలాలు… ఆదివారం రోజున…
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం అతనిది. రోజూ రిక్షాతొక్కి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో ఇళ్లు గడుపుకుంటూ కొంత సొమ్మును బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. ఇలాంటి రిక్షావాలాకు ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. రూ.3.47 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించాలని నోటీసులు పంపారు. దీంతో పాపం ఆ రిక్షావాలా షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగింది. జిల్లాలోని బకల్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్…
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ప్రోత్సహించాల్సిన నేతలు వారిని తక్కువచేసి మాట్లాడుతున్నారు. చీకటి పడ్డాక మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని పురుషులను తోడుగా తీసుకెళ్లడం మంచిది అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. వారణాసిలోని బజర్డిహా ప్రాంతంలో వాల్మీకి బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లో మహిళా…
లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. రైతులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్తుండగా ఆమెను అడ్డుకొని రెండు రోజులపాటు గెస్ట్‌హౌస్‌లో ఉంచారు. ప్రియాంకగాంధీ గెస్ట్ హౌస్‌లో నిరసనలు నిరసలు తెలియజేసింది. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు పోలీసులు ప్రియాంక గాంధీకి అనుమతులు ఇచ్చారు. కాగా, ఇప్పుడు మరోసారి ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రా పరిధిలోని జగదీష్…
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ ప్రయత్నిస్తున్నది. అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా వదుకుకోవడంలేదు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. రైతుల నిరసలకు మద్ధతు తెలపడమే కాకుండా వారితో కలిసి పోరాటం చేశారు. లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు, పోరాటం చేసిన విధానం ఆ పార్టీకి కొంతమేర…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. 2017 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకున్నది. అయితే, ఈసారి ఆ పార్టీకి కొంత ఎదురుగాలి విస్తుండడంతో, దానిని తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర పేరుతో యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తం అవుతున్నది.…
ఉత్తర భారతదేశంలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చేనెలలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరగబోతున్న ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపై ప్రియాంకను రంగంలోకి దించుతోంది బీజేపీ. లాయర్‌గా ఆమెకు కోల్‌కతాలో మంచిపేరు ఉన్నది. డేరింగ్ విమెన్‌గా ఆమెకు అక్కడ పేరు ఉన్నది. 2021 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు…
కరోనా మొదటి దశలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. వలసకూలీలు వందలాది కిలోమీటర్ల మీద నడిచి స్వస్థలాలకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి వలస కూలీలు నగరం బాట పట్టారు. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ మహమ్మారి ఉదృతి భీభత్సంగా ఉంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల రేటు…