Girl Was Sold For Phone : మొబైల్ ఫోన్ శరీరంలో ఓ పార్టులా మారిపోయింది. మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ వచ్చేస్తోంది. యువత కూడా కొత్త కొత్త మోడల్ ఫోన్ల వాడేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం ఎంతటి ఖర్చుకైనా వెనకాడడం లేదు. కొందరు మొబైల్స్ మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటిదే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. ఈ కేసులో నలుగురు మైనర్లు సహా ఐదుగురు నిందితులను సైద్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ద్వారా నేటి యువత ఖరీదైన మొబైల్‌ల అభిరుచిలో ఏ స్థాయికి పడిపోతుందో కూడా అర్థమవుతోంది. ఈ సందర్భంలో పోలీసు సూపరింటెండెంట్ ఓంవీర్ సింగ్ చెప్పిన సంఘటన హృదయ విదారకంగా ఉంది.
Read Also: Currency Notes On Road : కదులుతున్న కారునుంచి కరెన్సీ నోట్లు
ఘాజీపూర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, సైద్‌పూర్ ఏరియా పరిధిలోని రస్తీపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో కూలీ పని చేస్తున్న కార్మికుడు అస్వస్థతకు గురికావడంతో తన తండ్రి స్థానంలో పనికి వచ్చిన ఓ మైనర్ బాలుడు.. ఇంటి యజమాని మనవరాలితో పాటు ఇంకో మైనర్‌ను ప్రలోభపెట్టాడు. నిందితుడితో కలిసి కోచింగ్‌కు వెళ్లే సమయంలో వారిని బైక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు మైనర్ నిందితులు బాలికను చౌబేపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారి ముగ్గురు స్నేహితులు రెండు మోటార్‌సైకిళ్లపై వారిని కలుసుకున్నారు. బాలికను తీసుకెళ్లిన ఇద్దరు మైనర్ నిందితులు.. బాలికను తమ స్నేహితులకు అప్పగించారు. ఈ ముగ్గురు మైనర్ బాలికను హైవే పక్కన ఉన్న గోధుమ పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి రోజంతా వారణాసి చుట్టూ తీసుకెళ్లారు.
Read Also: Google Map: విద్యార్థి కొంప ముంచిన గూగుల్ మ్యాప్..! ఎంత పనిచేసింది..
పట్టుబడకుండా ఉండేందుకు వారణాసిలోని విశ్వ సుందరి వంతెన వద్దకు తీసుకెళ్లి వంతెనపై నుంచి బాలికను గంగా నదిలోకి విసిరారు. నదిలో చేపలు పట్టే బోట్‌మెన్‌లు బాలికను రక్షించి స్థానిక పోలీసు పోస్ట్ నాగవాన్‌కు సమాచారం అందించారు. అక్కడ నుండి బాలికను ట్రామా సెంటర్‌లో చేర్చారు. బాలిక స్పృహలోకి రాగానే ఫోన్ నంబర్ ఇవ్వడంతో ఇంటికి సమాచారం అందించారు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం నిందితుడిని విచారించగా.. తనకు మొబైల్ ఫోన్ కొనేందుకు రూ.20 డబ్బులు అవసరమని అందుకే, తన ముగ్గురు స్నేహితులకు బాలికను ఆఫర్ చేసినట్లు ఒప్పుకున్నాడు.