ఉత్తరప్రదేశ్ పోలీసులు.. నేరగాళ్ల అంతుచూశారు. దుండగుల భరతం పట్టారు. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు క్రిమినల్స్ హతమయ్యారు. ఈ ఘటనలో ఒక పోలీస్ గాయపడ్డారు. ముస్తఫా కగ్గా ముఠా సభ్యుడు అర్షద్‌తో పాటు మరో ముగ్గురు మంజీత్, సతీష్, ఒక గుర్తు తెలియని సహచరుడు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
ఇది కూడా చదవండి: Sanjay Raut: బంగ్లాదేశీయులు అక్రమ వలసల బాధ్యత బీజేపీ, అమిత్ షాదే..
యూపీలో యోగి ప్రభుత్వం నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మంగళవారం షామ్లి జిల్లాలోని జింఝానా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగరు దుండగులు హతమయ్యారు. ఒక ఇన్‌స్పెక్టర్ కూడా గాయపడ్డాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
#WATCH | 4 miscreants were killed in an encounter by Uttar Pradesh STF in the Jhinjhana area of Shamli district; an STF inspector was also injured.
Mustafa Kagga gang member Arshad along with three others- Manjeet, Satish and one unknown accomplice were injured in the encounter.… pic.twitter.com/PXj1Dhpw6f
— ANI (@ANI) January 21, 2025