Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌కు రానున్న 73 దేశాల దౌత్య వేత్తలు
- ప్రయాగ్‌రాజ్‌కు రానున్న 73 దేశాల దౌత్య వేత్తలు
- ఇప్పటికే 12 కోట్లకుపైగా పుణ్యస్నానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం వరకు 12 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహా వైభవంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అంతేకాకుండా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Padma awards 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మవిభూషణ్ ఎవరెవరికి దక్కాయంటే?
Also Read
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
- Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
రష్యా, ఉక్రెయిన్ సహా అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవీయా ఇలా 73 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు. ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి విదేశాంగ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. దౌత్యవేత్తలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం అక్షయావత్, బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు.
ఇది కూడా చదవండి: Draupadi Murmu: రిపబ్లిక్ డే సందేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రస్తావన.. రాష్ట్రపతి ఏమన్నారంటే..!
భక్తుల రాకతో ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.
ఇది కూడా చదవండి: Padma Award 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!