భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే వివాహ బంధం. ప్రియుడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీసే ఈరోజుల్లో.. తన భర్త అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది.
క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలోకి చిరుత పులి ప్రవేశించింది. దీంతో పెళ్లి వాళ్లు.. బంధువులు హడలెత్తిపోయారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. చిరుత పులి ఎలా ప్రవేశించిందో.. ఏమో తెలియదు గానీ.. పెళ్లి వాళ్లను మాత్రం హడలెత్తించింది.
Mamata Banerjee: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద…
మహా కుంభమేళాలో భాగంగా ఫిబ్రవరి 12న ప్రయాగ్‌రాజ్‌లో మాఘి పూర్ణిమ స్నానం జరగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు అత్యంత భారీగా భక్తులు పోటెత్తారు. తాజాగా మహా కుంభమేళాకు ఊహించని రీతిలో తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. కనీసం కాలు తీసి కాలు వేయలేనంతగా భక్తులు తరలివచ్చారు.
భార్యాభర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు.. అలకలు ఉంటాయి. కొద్దిసేపు కోపం ఉంటుంది. మరికొద్దిసేపటికే కలిసి పోతుంటారు. ఇలా ప్రతి సంసారంలోనూ కామన్‌గా జరుగుతుంటాయి. అంతమాత్రాన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కాపురాలు కూలిపోతాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. ఇక సోమవారం వసంత పంచమి కారణంగా భక్తులు అంతకంతకు రెట్టింపుగా తరలివచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్‌లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురి మృతిచెందినట్లు తెలుస్తోంది.