భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే వివాహ బంధం. ప్రియుడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీసే ఈరోజుల్లో.. తన భర్త అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
రూపేష్ (35), రీనా (32) భార్యాభర్తలు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బిడ్డతో కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. ఊహించని రీతిలో మృత్యువు ఆ కుటుంబాన్ని కబళించేసింది. రూపేష్ అనారోగ్యంతో గురువారం చనిపోయాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. గురువారం రూపేష్ అంత్యక్రియలు నిర్వహించారు. దు:ఖంలో ఉన్న భార్యను ఇరుగుపొరుగు వారంతా ఓదార్చారు. అయినా కూడా ఆమె దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే భర్తే లేనప్పుడు తానెందుకు ఈ భూమ్మీద అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం రీనా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా.. ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. రీనా ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ అయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దంపతులిద్దరూ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఏడాది బిడ్డ అనాథయ్యాడు.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
రూపేష్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయాడని.. దంపతులిద్దరూ సంతోషంగా ఉంటారని స్థానిక కౌన్సిలర్ రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. భర్త అంత్యక్రియలు పూర్తి చేసి.. ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే భార్య చనిపోవడం స్థానికంగా కలిచివేసిందని.. ఇది చాలా దిగ్భ్రాంతికర విషయమని పేర్కొన్నారు. తన భర్త మరణంతో అంతా అయిపోయిందని ఆమె ఏడ్చిందని కౌన్సిలర్ చెప్పారు. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టి చూడగా ఆమె పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. గురువారం సాయంత్రమే రూపేష్ అంత్యక్రియలు నిర్వహించామని.. శుక్రవారం ఉదయానికి భార్య కూడా చనిపోవడం శోకసంద్రంలో మునిగిపోయామని కౌన్సిలర్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Marvel Studios : కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్.. కాంపిటీషన్ ను తట్టుకుంటుందా.?