Kannauj rape case: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత నిందితుడిగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌లోని అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన ఎస్పీ నేత నవాబ్ సింగ్ యాదవ్ యొక్క డీఎన్ఏ నమూనా, బాలిక నుంచి సేకరించిన డీఎన్ఏతో మ్యాచ్ అయింది. దీంతో ఈ కేసులో అతడి చుట్టూ మరింత ఉచ్చు బిగిసింది.
యూపీలోని హాపూర్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) యునైటెడ్ కిసాన్ మోర్చా నిరసన వ్యక్తం చేసింది. రైతులు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత, కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఢిల్లీ-లక్నో రహదారిని దిగ్బంధించి అక్కడే బైఠాయించారు. దిష్టిబొమ్మ విషయంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దిష్టిబొమ్మను లాక్కున్నారు. హాపూర్ నగర్‌లో రైతులు, పోలీసుల…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో పేపర్ లీక్ అయిందంటూ పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై యూపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
UTTAR PRADESH: ఉత్తర్ ప్రదేశ్‌లో శివభక్తులు చేసే ‘కన్వర్ యాత్ర’కు ముజఫర్ నగర్ పోలీసులు పెట్టిన రూల్స్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. యాత్రా మార్గంలో తినుబండారాల విక్రేతలు తమ పేర్లను తప్పకుండా ప్రదర్శించాలని యూపీ పోలీసులు ఆదేశించారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ప్రసవ సమయంలో ఓ గర్భిణి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు.
Uttarpradesh : భర్త భయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఓ భార్య చేసిన పని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భర్త భయంతో భార్య ఇంట్లో చోరీకి కుట్ర పన్నింది.
Police: మహిళా కానిస్టేబుల్‌తో ఓ హోటల్ గదిలో పట్టుడిని పోలీస్ ఉన్నతాధికారిని కానిస్టేబుల్ ర్యాంక్‌కి తగ్గించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్‌తో రాజీపడే స్థితితో పట్టుబడిని డిప్యూటీ సూపరింటెండెంట్ కృషా శంకర్ కన్నౌజియాను యూపీ పోలీసులు మూడేళ్ల తర్వాత కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో యూపీ ఎస్టీఎఫ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధాన సూత్రధారి రవి అత్రి సహా 18 మంది నిందితులపై ఎస్టీఎఫ్ మీరట్ యూనిట్ 900 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
యూపీ రాజధాని లక్నోలోని దేవా రోడ్లో ఉన్న ఓయో రెడ్ బిల్డింగ్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 105లో 22 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. అమ్మాయి బారాబంకి నివాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎగ్ రోల్ డబ్బులు అడిగిన ఒక దుకాణదారుడు కస్టమర్‌ని బాకీ డబ్బు అడగగా, కస్టమర్ అతన్ని దారుణంగా కొట్టాడు.