Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ప్రసవ సమయంలో ఓ గర్భిణి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే కాసేపటి తర్వాత డాక్టర్లు ఆ మహిళ కుటుంబసభ్యులకు చేదువార్త చెప్పారు. ‘మేము ఆమెను రక్షించలేకపోయాము. తనతో పాటు చిన్నారి కూడా మృతి చెందింది.’ ఇది విన్న వెంటనే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆసుపత్రి ఫార్మాలిటీస్ పూర్తి చేసి మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వారికి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య చితి బూడిదలో ఏదో కనిపించింది. ఇది భర్తను షాక్కు గురిచేసింది.
Read Also:Kejriwal Health Condition: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై తీహార్ జైలు అధికారులు క్లారిటీ..?
విషయం హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాథోరా ఖుర్ద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న సందీప్ భార్య నవనీత్ కౌర్ ప్రసవం కోసం మీరట్‌లోని మవానా పట్టణంలోని జెకె ఆసుపత్రిలో చేరారు. అయితే సర్జరీ సమయంలోనే చనిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులు మహిళను శ్మశాన వాటికలో దహనం చేశారు. చితి కాలిపోవడంతో కుటుంబ సభ్యులు చితాభస్మాన్ని సేకరించేందుకు వచ్చారు. అప్పుడు మృతురాలి భర్తకు అక్కడ సర్జికల్ బ్లేడ్ కనిపించింది. బ్లేడు తీసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. మహిళకు ఆపరేషన్ సమయంలో, అదే సర్జికల్ బ్లేడ్ ఆమె కడుపులో మిగిలిపోయిందని, దాని కారణంగా ఆమె చనిపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు.
Read Also:Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
అంత్యక్రియల చితిలో నుంచి బ్లేడ్ బయటకు రావడంతో కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. కుటుంబ సమేతంగా సీఎంఓ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రి లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. దీంతోపాటు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి దీనిపై విచారణ జరుపుతారు. ఆరోపణలు నిజమని తేలితే వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.