యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె 53 మందితో కూడిన తొలి జాబితాలో విడుదల చేశారు. మరో ఐదుగురు అభ్యర్థుల్ని ఈరోజు సాయంత్రాని కల్లా ప్రకటిస్తామని ఆమె చెప్పారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అన్ని స్తానాల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి…
ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కుల ప్రాతిపదికన ఏర్పడిన ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఓబీసీ, దళిత కమ్యూనిటీలకు అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను కులాలే నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఆ కుల పార్టీలలో కూడా చీలికల వర్గాలను మనం చూడవచ్చు.…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో దేశంలో రాజకీయ వాతావరణం మారింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడతాయని కొందరు భావించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయలేదు. సకాలంలో ఎన్నికలు జరపటానికే మొగ్గు చూపుతూ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య పలు దశలలో పోలింగ్ జరుగుతుంది. మార్చి పదవ తేదీన ఫలితాల వెల్లడితో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమవుతుంది. ఎలక్షన్…
మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్‌లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో…
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు టెన్షన్ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు…
యూపీలో ఎన్నికల వేడి రగులుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా…
యూపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. 2022లో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో మొత్తం నాలుగు సార్లు వేర్వేరు చోట్ల వివిధ ప్రచార కార్యక్రమాలకు మోడీ హాజరవుతారు. ఇవి డిసెంబర్ 18-28 మధ్య రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ప్రభుత్వం వివిధ దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటోందని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. కొందరు ఎస్పీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ…
వచ్చే ఏడాది దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది బీజేపీ. దీనికోసం పావులు కదుపుతున్నది. ఎలాగైనా మెరుగైన స్థానాల్లో విజయం సాధించి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. అటు బీఎస్పీ కూడా పావులు కదుపుతోంది. అయితే, దేశంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పార్టీల్లో ఒకటి ఎంఐఎం ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ లో…
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ లతో పాటు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపైఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ నేతలు కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో గోరఖ్‌పూర్ ఎన్నికల్లో పాల్గొంటున్నారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ‘మేం చావనైనా చస్తాం..కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోం’ అంటూ తీవ్రంగా…
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ప్రజల్ని తమవైపు ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. యూపీలో తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలందరికీ 10లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.…