ఆయన చేసే కామెంట్స్ విపక్షాలకు అస్త్రాలుగా మారితే.. సొంత పార్టీ ఇరుకున పడుతోందా? సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్‌పై రచ్చదేశంలో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. కొత్తగా పాగా వేయాలని బీజేపీ అధిష్ఠానం వేయని ఎత్తుగడలు లేవు. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్, జేపీ నడ్డాలు…
వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ఎన్నికల బరిలో ఉండగా.. యోగికి ఓటు వేయకుంటే బుల్‌డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో హిందువులంతా ఏకమవ్వాలని ఆయన అన్నారు. యోగి అదిత్యనాథ్‌కు ఓటు వేయని ప్రాంతాలను…
దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇవాళ యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్ జరగనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఓటమి కి కాంగ్రెస్ పార్టీ యే ప్రధాన కారణం అవుతుందన్నారు. యోగి-మోడీ వటవృక్షాన్ని యూపీలో కదిలించింది ప్రియాంక గాంధీ. బీజేపీ వటవృక్షం పడిపోక తప్పదన్నారు హరీష్ రావత్. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలను హరీష్…
విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చారిత్రక…
యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. విజయం కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీపై విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలో దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై బీజేపీ మండిపడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. అధికార బీజేపీకి గట్టి సవాల్…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి దశ పోలింగ్‌కు మరో పక్షం రోజులే ఉన్నాయి. దాంతో పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ప్రస్తుత పబ్లిక్ మూడ్ ను బట్టి ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎస్పీగా కనిపిస్తున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనే అనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ బేస్ ఓటు దక్కించుకుంటే అదే పదివేలు. 2017 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి 22.23…
యూపీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా రోజులుగా మౌనంగా,అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థినిగా ప్రచారం చేసుకుంటున్న ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాయావతి. ఆ పార్టీ సీఎం…
యూపీలో ఎన్నికలు సూరత్ వ్యాపారులకు బంగారుపంట పండిస్తోంది. ఎన్నికలంటే ప్రచార హోురు. కానీ కరోనా పుణ్యమాని దేశంలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారీ బహిరంగ సభలకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో పార్టీలు వేరే దారులు వెతుకుతున్నాయి. యూపీ ఎన్నికలలో ప్రచారం కరోనా కారణంగా తగ్గిపోయింది. ఎన్నికలలో తమ తరఫున ప్రచారం చేసే మహిళలకు చీరలు పంచాలని నిర్ణయించింది. సూరత్ లోని వ్యాపారులకు 3 డీ ప్రింటింగ్ చీరలకు ఆర్డర్లు వచ్చాయి. సూరత్ లోని బట్టల…
యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. మళ్ళీ అధికారమే పరమావధిగా అడుగులు వేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయనున్నారా..? ఇంతకూ యోగీని అయోధ్యనుంచే పోటీకి దించాలని బీజేపీ నేతలు ఎందుకు భావిస్తున్నారు…? యోగీ, అయోధ్య స్థానానికి మారడం.. సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది.?అనేది యావత్ భారతాన చర్చనీయాంశంగా మారింది. యూపీ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు బీజేపీ అన్ని వ్యూహాల్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా సీఎం…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. అందేంటి? బీజేపీకి వరుసగా షాక్‌లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు…