యూపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. 2022లో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో మొత్తం నాలుగు సార్లు వేర్వేరు చోట్ల వివిధ ప్రచార కార్యక్రమాలకు మోడీ హాజరవుతారు. ఇవి డిసెంబర్ 18-28 మధ్య రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ప్రభుత్వం వివిధ దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటోందని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. కొందరు ఎస్పీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అఖిలేశ్ ఆ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దర్యాప్తు సంస్థలు మా ఫోన్ సంభాషణలన్నీ వింటున్నారు. ప్రతి సాయంత్రం ముఖ్యమంత్రి కొందరి ఫోన్ రికార్డింగులను వింటున్నారు. నాతో మాట్లాడే విలేకరులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి తెలిస్తే.. వివిధ ఏజెన్సీలను తమకు అనుకూలంగా వాడుకుంటుందన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. తమ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంసీబీఐ లాంటి సంస్థల్ని వాడుకునేది. అదే ధోరణి ఇప్పుడు కనిపిస్తోందన్నారు అఖిలేష్. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పేలా లేదు. యోగి ప్రభుత్వం మళ్ళీ రాబోదన్నారు. ప్రజలు మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు అఖిలేష్.