ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ లతో పాటు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపైఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ నేతలు కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో గోరఖ్‌పూర్ ఎన్నికల్లో పాల్గొంటున్నారని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ‘మేం చావనైనా చస్తాం..కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోం’ అంటూ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా యూపీ ప్రజలు ఉంటే ఎస్పీ, బీఎస్పీ నేతలు పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినప్పటికీ ప్రజలకు వెన్నంటే ఉండి సేవలందిస్తున్నామని ప్రియాంక చెప్పుకొచ్చారు.