యూపీలో ఎన్నికలు సూరత్ వ్యాపారులకు బంగారుపంట పండిస్తోంది. ఎన్నికలంటే ప్రచార హోురు. కానీ కరోనా పుణ్యమాని దేశంలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారీ బహిరంగ సభలకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో పార్టీలు వేరే దారులు వెతుకుతున్నాయి. యూపీ ఎన్నికలలో ప్రచారం కరోనా కారణంగా తగ్గిపోయింది. ఎన్నికలలో తమ తరఫున ప్రచారం చేసే మహిళలకు చీరలు పంచాలని నిర్ణయించింది. సూరత్ లోని వ్యాపారులకు 3 డీ ప్రింటింగ్ చీరలకు ఆర్డర్లు వచ్చాయి. సూరత్ లోని బట్టల వ్యాపారులు ప్రధానమంత్రి మోడీ, యూపీ సీఎం యోగి ఫోటోలతో కూడిన చీరలకు గిరాకీ ఏర్పడింది.యూపీలో మరోసారి గెలవాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.
403 సీట్లతో దేశంలో అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న యూపీలో ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అయితే బీజేసీకి మాత్రం ఈ ఎన్నికలు కీలకం అని చెప్పాలి. మినీ ఇండియాగా భావించే యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత, మార్చి 3న ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 14న ఈ ఎన్నికలు జరగనున్నాయి