Gun Fire: తన భార్య విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా తన ఐదుగురు పిల్లలను, అత్త, భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది. తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతోనే ఈ దారుణానికి తెగించాడని, కుటుంబంలోని ఏడుగురి మీద తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడని అమెరికా అధికారులు గురువారం తెలిపారు. ఉతాహ్ రాష్ట్రంలోని నోచ్ సిటీలోని ఒక నివాసంలో ఎనిమిది మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. మృతుల్లో నాలుగేళ్ల పాప కూడా ఉంది. అనుమానితుడిని మేఖేల్ హెయిట్‌గా పోలీసులు గుర్తించారు.
Read Also: Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్‌తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ
గతేడాది డిసెంబర్ 21న మేఖేల్ భార్య విడాకులకు అప్లై చేసింది. దాంతో, అతను కోపం ఆపుకోలేకపోయాడు. ఆమెతో పాటు అత్త, ఐదుగురు బిడ్డలను తుపాకీతో కాల్చి చంపాడు. బుధవారం రాత్రి నిర్వహించిన వెల్ఫేర్ చెకింగ్‌లో ఆ ఇంటి వాళ్లంతా చనిపోయారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆధారాలను బట్టి ఏడుగురిని చంపిన తర్వాత అనుమానితుడు తనను తాను కాల్చుకున్నాడని తెలుస్తోంది. కాల్పుల ఘటనుకు కారణం విడాకుల వివాదమే అని ఎనోక్ మేయర్ జియోఫ్రే చెస్‌నట్ తెలిపాడు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, డిసెంబర్ 21వ తేదీన కోర్టులో అతని భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది” అని ఆయన విలేకరులతో అన్నారు. చెస్నట్ ఎనోచ్ చిన్న ఊరు. అందరూ ఒకరికొకరు బాగా తెలుసు. పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ.. నిందితుడు మా పొరిగింట్లో ఉంటారు. వారి పిల్లలు మా పిల్లలతో కలిసి ఆడుకుంటారని తెలిపారు. డైవర్స్‌కు గల కారాణాలేంటో కూడా ఇంకా తెలియరాలేదు.