కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిరిండియా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ప్రయాణించారు. అయితే కేంద్రమంత్రికి ఒక విరిగిపోయిన సీటును కేటాయించారు.
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు…
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సమావేశం నిర్వహించింది.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసలు కురిపించారు. బొగ్గు, గనుల శాఖలో సమర్థతతో పాటు పారదర్శకత తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారని కితాబు ఇచ్చారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు - ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.
రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు.
Online Games Banned: ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ యువ తరాన్ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా శాసిస్తోంది. ఇది ఒక రకమైన వ్యసనం. ఇది ఇప్పుడు నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయల్ ఆన్లైన్ గేమింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో ఆయనకు తోడుగా మాజీ ఎంపీ డాక్టర్ సోనాల్ మాన్ సింగ్ కూడా నిలుస్తున్నారు. ఈ సందర్బంగా సోనాల్ మన్ సింగ్ మాట్లాడుతూ.. యువతరం…
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..
కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు. READ MORE: Jammu…