కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు – ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో రేప్ కేసులు 28.94%, మహిళల హత్యలు 13%పెరిగాయి. కిడ్నాప్‌లు, అపహరణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది? మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు. కాంగ్రెస్ దోపిడీ దారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారింది.” అని విమర్శించారు.
READ MORE: Ap Highcourt : గేమ్ ఛేంజర్ , డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు నిన్న తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వరకు ఎలా రానిచ్చారు అని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి.. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చింది. ఇక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: Niharika Konidela: నా మనసు ముక్కలైంది: నిహారిక