రేపు సికింద్రాబాద్ - వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక , గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన తీవ్ర వివాదాలకు దారి తీసింది. అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. భారత్‌లో సిక్కులు భయంతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు కూడా మండిపడ్డారు.
రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు.
Kinjarapu Ram Mohan Naidu: స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని కెపిహెచ్బి కాలనీ లోని పార్క్ లో చెత్తను శుభ్రపరిచారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రమగా ఉంటే మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం 10 సంవత్సరాలు క్రితం మోడీ గారు ప్రాంభించారు. శ్రీకాకుళం స్వచ్ఛభారత్ లో టాప్ 10 లో ఉంచాలని లక్ష్యం పెట్టుకోవాలి., అంత పెద్ద వరద వచ్చిన తరువాత…
ప్రధానమంత్రి పదవి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఆశయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం పెద్ద ప్రకటన చేశారు.
మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అవినీతి విషయంలో కళ్ళు తెరిచి చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు.
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో టోల్‌ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బీహార్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. మైక్రోఫోన్‌ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు.