Union Minister Kishan Reddy: హైదారబాద్ లోని తాజ్ కృష్ణ లో G-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు 9దేశాల ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం వేచిచూడటం కంటే.. ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందన్నారు. ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. 85వేలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్‌లతో ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అన్నారు కేంద్ర మంత్రి. ఈ స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి అని తెలిపారు. అందుకే ఈ వ్యవస్థను ప్రోత్సహించేలా పాలసీలు రూపొందించిందని అన్నారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానాలు మెరుగుపడిందని తెలిపారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని మరిన్ని కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు.
Read also: Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు
దేశంలో తెలంగాణ యువ రాష్ట్రంగా నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ముందుకు వెళ్తోందని అన్నారు. దేశంలో 19 వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, రోజుకు ఐదారు కొత్త స్టార్టప్ కంపెనీలు పుడుతున్నాయని తెలిపారు. పరిశ్రమలు, ఐటి, విద్య, వైద్య రంగాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఇంటర్నెట్ సేవలు విస్తృతం అవుతున్నా కొద్దీ స్టార్టప్ సంస్థల్లో కొత్త ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. నీతి అయోగ్ కూడా థింక్ ట్యాంక్ లాంటిందన్నారు. కేంద్రం రాష్ట్రాలకే కాకుండా మారుమూల గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నీతి అయోగ్ పరిధిలో ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 69 ఇంక్యూబేషన్ సిస్టమ్స్ ఉన్నాయి.
Waltair Veerayya: వరంగల్ కు వాల్తేరు వీరయ్య టీమ్.. గెస్ట్ గా ఆర్ఆర్ఆర్ హీరో..