పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైందని ఆమె వెల్లడించారు. రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం చేస్తున్నామని, ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నామన్నారు. 2…
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు లోక్ సభలో 2022–2023 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా.. డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం. ఎయిర్ ఇండియా బదిలీ…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుందని, ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమీ అన్నారు. అంతేకాకుండా.. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించామని…
బడ్జెట్ హైలైట్స్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 4 వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. పేద మధ్యతరగతి సాధికారితకు ప్రభుత్వం పనిచేస్తోంది. వచ్చే 25 ఏళ్ళ పురోగతికోసం బడ్జెట్. ప్రపంచంలోనే వేగంగా పురోగతి సాధిస్తున్న భారత్. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి,…
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌పై తమకు ఊరట కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు ఇన్ కంట్యాక్స్ పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సమయం ఆసన్నమైంది.. కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.. ఈ సారి కూడా రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సెషన్ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.. ఇక, కేంద్ర బడ్జెట్ 2022-23ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో…
కేంద్రం ఆదాయం కోసం దేన్నీ వదలడం లేదు. తాజాగా కేంద్రం టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంచాలని భావించింది. అయితే వస్త్ర వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. అదేసమయంలో కొనుగోలు దారులకు కూడా ఊరట కలుగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆమె కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రుణ సేకరణపై విధించిన సీలింగ్, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కడపలో ఏర్పాటు చేస్తున్న వై.ఎస్.ఆర్ స్టీల్ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి. గురువారం నాడే ప్రధాని మోడీతో విజయసాయి భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత…
దేశంలో డిజిటల్ విప్లవం ఎంతవరకు సాధ్యమైంది ఈ వీడియో ను చూసి మనం తెలుసోవచ్చు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రధాని మోడీ డిజిటల్ విప్లవానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏ చిన్న కిరాణా కొట్టు, పాన్, టీ స్టాల్ ఇలా చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు ఇంటిముందుకు గంగిరెద్దులను తీసుకువచ్చి ఆటలాడిస్తుంటారు. అలా వచ్చిన వారికి బియ్యంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న “అన్ రాక్” కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించాను. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే, ఒక…