రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు లోక్ సభలో 2022–2023 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా.. డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం. ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయిందని ఆమె తెలిపారు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తామని, తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని ఆమె వెల్లడించారు.
2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నామని, వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం. ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు. డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన. ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించామని ఆమె తెలిపారు. రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైందని ఆమె తెలిపారు.