కేంద్ర ఆర్థికమంత్రితో భేటీయైన ఏపీ ఆర్థికమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న “అన్ రాక్” కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించాను. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే, ఒక పెద్ద కంపెనీ రాష్ట్రానికి వస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో చర్చించాను. వీటిని నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.
విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఉండాలన్నది సీఎం జగన్ ఉద్దేశమన్నారు బుగ్గన. పోలవరం ప్రాజెక్టు అంశం, నిధుల విడుదలలో పురోగతి ఉంది. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం పాడైపోయిన పర్వాలేదనే తరహాలో టీడీపీ ఆలోచిస్తోంది. టీడీపీ దుర్మార్గానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పులపై తెలుగుదేశం పార్టీ అనవసరపు రాద్ధాంతం చేస్తోంది. “కరోనా” కష్టకాలంలో పేదలను కాపాడడం కోసం అప్పులు తీసుకొచ్చాం. తెలుగుదేశం హయాంలో “కరోనా” లేనప్పటికీ అప్పులు చేశారు. “కరోనా” కారణంగా రాష్ట్రానికి పెరగాల్సిన ఆదాయం పడిపోయింది. అందుకే ఈ పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోంది. టీడీపీ ప్రవర్తన కారణంగా మొత్తంగా రాష్ట్రానికి నష్టం కలుగుతోంది’ మంత్రి బుగ్గన తెలిపారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!