కేంద్రమంత్రి వస్తున్నారని వారంరోజుల ముందు నుంచే హడావిడి చేశారు. బోలుడన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కూడా. తీరా.. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి వచ్చాక.. లెక్కలు చెప్పలేక తడబడ్డారు. సీనియర్లు అనుకున్నవారే గుడ్లు తేలేశారు. కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలపై చర్చ! శ్రీకాకుళం జిల్లాలో ఖద్దరుకు పేరొందిన పొందూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఎన్నోఏళ్లుగా ఆదరణ లేకుండా పోయిన పొందూరు ఖాదీ, ఖద్దరు పరిశ్రమకు ఆమె పర్యటనతో దశ తిరిగిపోతుందని భావించారు సిక్కోలు…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్ పాల్గొననున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేడు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఆర్ధిక మంత్రి. తర్వాత విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పాల్గొనగా… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాం అన్నారు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆమోదం ప్రోగ్రెస్ లో…
బ్లాక్ ఫంగస్ ఔషధతో పాటు కోవిడ్ 19 కట్టడికోసం చేపట్టే సహాయక చర్యల్లో ఉపశమన చర్యలు చేపట్టింది కేంద్రం.. ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారమన్ అధ్యక్షతన జరిగిన 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాటిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. టీకాలపై 5 శాతం జీఎస్టీకి కట్టుబడి ఉండటానికి కౌన్సిల్ అంగీకరించిందని తెలిపారు..టీకాలు, మందులు మరియు పరికరాలతో సహా వివిధ కోవిడ్ వస్తువులపై పన్ను మినహాయింపు మరియు రాయితీలను…