పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైందని ఆమె వెల్లడించారు. రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం చేస్తున్నామని, ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నామన్నారు. 2 లక్షల అంగన్ వాడీలలో వసతులను మెరుగుపరుస్తామని, ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచుతున్నామని ఆమె తెలిపారు.
డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. కమర్షియల్ బ్యాంకులు ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీలో అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు. కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.