పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుందని, ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమీ అన్నారు. అంతేకాకుండా.. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించామని ఆమె తెలిపారు.
పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి చేస్తున్నామని, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని, జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతామని ఆమె వెల్లడించారు. అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు. 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్. దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం చేస్తున్నట్లు, 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.