Israel-Hamas War: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల గురించి క్లోజ్డ్ డోర్ సెషన్ నిర్వహించబోతోందని యూఎన్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇజ్రాయిల్‌పై హమాస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలో ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.
భారత్ విశ్వ దేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన భాగస్వామి ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వంపైనా ఆయన స్పందించారు.
India at UN: ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ముఖ్యంగా ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వ హోదా, వీటో అధికారం ఉండటంపై గళమెత్తుతోంది. కేవలం ఈ ఐదు దేశాలు మాత్రమే ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేవని చెబుతోంది. భారత్ వాదనకు ఇతర ప్రపంచదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. భద్రతా మండలిని సంస్కరించాలని పలుమార్లు భారత్ యూఎన్ ను కోరింది.
India strong Reply After Pak Raises Kashmir At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది. భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భద్రతా మండలిలో…
డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పలు ఈవెంట్‌లను భారత్ నిర్వహించనుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్‌ల బిడ్‌లకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంగళవారం తెలిపారు.
భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది.
india comments on china in UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డ్రాగన్ దేశం చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రవాదులపై చైనా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలన్న అమెరికా, భారత్ ప్రతిపాదనలను యూఎన్ లో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంది. గురువారం యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనా…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాజధాని కీవ్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకునేలా ముందుకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది రష్యా.. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది… రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఓటింగ్ కూడా నిర్వహించారు.. అయితే, ఓటింగ్‌కు మాత్రం భారత్, చైనా దూరంగా ఉన్నాయి.. భద్రతా మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ ఓటు వేయగా.. భద్రతా…
ఇండియాకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ప్రస్తుతం ఇండియా తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్షస్థానంలో ఇండియా ఉండటం విశేషం. ఇండియా అధ్యక్షతన సముద్ర భద్రతపై ఈరోజు బహిరంగ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఇండియా తరపున ప్రధాని మోడి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతున్నది. భద్రతా మండలిలోని సభ్యదేశాలు, ఐక్యరాజ్య…