ఇండియాకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ప్రస్తుతం ఇండియా తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్షస్థానంలో ఇండియా ఉండటం విశేషం. ఇండియా అధ్యక్షతన సముద్ర భద్రతపై ఈరోజు బహిరంగ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఇండియా తరపున ప్రధాని మోడి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతున్నది. భద్రతా మండలిలోని సభ్యదేశాలు, ఐక్యరాజ్య…
ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇండియా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతోంది. సభ్యదేశంగా కొనసాగుతున్న ఇండియాలకు ఇప్పుడు ఆ మండలి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో భారత్ నెలరోజులపాటు కొనసాగుతుంది. ఇంతకు ముందు ఫ్రాన్స్ ఆ హోదాలో కొనసాగింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిది టిఎస్ తిరుమూర్తి బాధ్యతలు చేపట్టారు. భారత్‌కు ఈ పదవి వచ్చేందుకు ఫ్రాన్స్ సహకరించింది. ఈ ఆగస్టు నెలలోనూ అదే విధంగా తాత్కాలిక సభ్యదేశంగా తప్పుకునే చివరి…