India strong Reply After Pak Raises Kashmir At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది. భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భద్రతా మండలిలో ఎత్తి చూపుతూ.. ఘాటు విమర్శలు చేశారు. బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇవ్వడంతో పాటు పొరుగును ఉన్న పార్లమెంట్ పై దాడికి తెగబడిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని జైశంకర్ పాకిస్తాన్ తీరును విమర్శించారు.
Read Also: FIFA World Cup: ఫైనల్స్‌కు చేరిన ఫ్రాన్స్.. సెమీస్‌లో మొరాకో చిత్తు
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ తన మిత్రదేశం అయిన పాకిస్తాన్ ను కాపాడుతూ వస్తున్న చైనా తీరును కూడా జైశంకర్ ఎండగట్టారు. భద్రతా మండలి ఆంక్షల కమిటిలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను కాపాడుతూ వస్తోంది. దీనిపై కూడా చైనా తీరును కూడా పరోక్షంగా విమర్శించారు. అత్యంత శక్తివంతమైన 15 దేశాల భద్రతా మండలి సమావేశాలు భారత్ అధ్యక్షతన జరిగాయి. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మహమ్మారి, ఉగ్రవాదం, వాతావారణ మార్పు కీలక సవాళ్లపై పనిచేయడంపై ఐక్యరాజ్యసమితి విశ్వనీయత ఆధారపడి ఉందని అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయని.. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని, ఆర్టికల్ 370, 35ఏని రద్దు చేసిన తర్వాత భారత్-పాక్ సంబంధాలు ఎప్పుడూ లేనంతగా క్షీణించాయి. దీంతో పాకిస్తాన్ పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ఏ అంశంపై చర్చ జరిగినా.. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. కాశ్మీర్ మాట ఎత్తినప్పుడల్లా భారత్, పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం ఇస్తోంది. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత విషయం అని పలు వేదికలపై భారత్ పదేపదే చెబుతోంది. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్ తో సంబంధాలు ఉంటాయని భారత్ చెబుతోంది.