ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేలా అడుగులు వేస్తోంది రష్యా… ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకునే పనిలోపడిపోయాయి రష్యా బలగాలు.. యుద్ధం వద్దంటూ అన్ని దేశాలు సూచిస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. ఉక్రెయిన్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రతిఘటన ఎదురవుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఆరా తీయడంతో పాటు.. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే మంచిదని సలహా ఇచ్చిన విషయం…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరుకుంది.. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని కూడా హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌కు ఉన్న సంబంధాలు తెగిపోయేలా చేసింది రష్యా.. అతిపెద్ద రన్‌వేతో కూడిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశం ఉండడంతో.. కీవ్శివారులోని తమ బలగాల్ని తరలించాలన్నా.. రప్పించాలన్నా రష్యాకు మరింత సులువు…
ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా ఈ ప్రకటన చేసిన వెంటనే, తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే, రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడం, రష్యా ఆస్తులను స్థంభింపజేయడం, సైబర్ దాడులు చేయడం వంటివి చేస్తుండటంతో పుతిన్ యూటర్న్ తీసుకున్నారు. ఎవరు చెప్పినా వినొద్దని, ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి నుంచి ఈ విధమైన…
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భయాందోళనలు కలిగిస్తున్నది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా దళాలు వేగంగా కీవ్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా అది ఎంతసేపు అన్నది ఎవరూ చెప్పలేరు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాలిబన్లు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తాలిబన్లు హెచ్చరించారు. సమస్యలను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని…
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ రాజకీయ జీవితాన్ని ఆరంభించే ముందు ఆయన ఏం చేశారు అనే విషయాలు ఇప్పుడు హైలెట్‌గా మారాయి. సోషల్ మీడియాలో జెలెస్కీ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. జెలెస్కీ కి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జెలెస్కీ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఓ కమెడియన్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన నటించిన ఓ టీవీ సీరియల్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించిపెట్టింది. ఆ ప్రజాభిమానాన్ని జెలెస్కీ రాజకీయంగా…
ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి. రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు మెడిసిన్ తో పాటు వివిధ కోర్సులను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. సడెన్‌గా యుద్ధం రావడంతో యూనివర్శిటీల నుంచి విద్యార్థులను బయటకు పంపించేశారు. భారతీయ విద్యార్థులను సొంత దేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. Read: CM Jagan : ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోంది ఉక్రెయిన్ గగనతలాన్ని…
ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎలాగైనా ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చేయాలని చాలా మంది ప్రజలు చూస్తున్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 16 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మారుతున్న సమయంలో భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. భారతీయులు వెంటనే వెనక్కి వచ్చేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక విమానాలను పంపింది. పరిస్థితులు దిగజారిపోతున్న సమయంలో సుమారు 4 వేల మంది భారతీయులు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం… హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో పలు కీలక సూచనలు చేసింది సర్కార్. Read Also: Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ…