ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా ఈ ప్రకటన చేసిన వెంటనే, తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే, రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడం, రష్యా ఆస్తులను స్థంభింపజేయడం, సైబర్ దాడులు చేయడం వంటివి చేస్తుండటంతో పుతిన్ యూటర్న్ తీసుకున్నారు. ఎవరు చెప్పినా వినొద్దని, ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి నుంచి ఈ విధమైన ఆదేశాలు రావడంతో రష్యన్ ఆర్మీ మరింత వేగంగా దూసుకుపోటున్నది. కీవ్‌లో ఇప్పటికే కీలక ప్రాంతాలను రష్యా గెరిల్లా దళాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పినా సరే ఆక్రమణలకు దిగకుండా వదిలే ప్రసక్తి లేదని రష్యా స్పష్టం చేసింది.
Read: Russia-Ukraine War:ఉక్రెయిన్-రష్యా వార్‌పై తాలిబన్ కీలక వ్యాఖ్యలు..