ఉక్రెయిన్-రష్యా సంక్షోభం తారా స్థాయికి చేరింది. అమెరికా ఆశపడ్డట్టు ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యక్ష దాడి చేయలేదు. కానీ, అంతకు మించిన షాక్ ఇచ్చింది ప్రపంచ పెద్దన్నకు. పుతిన్ దురాక్రమణకు దిగాడని అమెరికా గగ్గోలు పెడుతోంది. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ప్రెసిడెంట్ బైడెన్ ఆరోపించారు. ఆంక్షల పర్వానికీ అమెరికా తెరలేపింది. రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలు వీఈబీ, రష్యా మిలిటరీ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అలాగే అక్కడి ఉన్నత వర్గాలు, వారి కుటుంబాలపై కూడా ఆంక్షలు పెట్టనుంది.…
ఉక్రెయిన్ రష్యా మధ్య బోర్డర్ సమస్యలు పెద్ద యుద్దవాతారవణం నెలకొన్నది. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఈరోజు ఉదయం 200 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. మూడు విమానాల్లో వీరిని తరలించారు. గురు, శనివారాల్లో మరో రెండు విమానాలు ఉక్రెయిన్‌కు వెళ్లనున్నాయి. Read: Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన…
ఉక్రెయిన్- రష్యా సరిహద్దుల్లో పరిస్థితులు చేజారిపోయేలా కనిపిస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా తగ్గేదిలే రష్యా చెబుతున్నది. ఉక్రెయిన్ లోని ప్రత్యేక వేర్పాటువాదుల ప్రాంతాలను రెండు స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తిస్తు డిక్లరేషన్‌పై సంతకం చేసింది. ఉక్రెయిన్‌ను నిర్వీర్యం చేసి పూర్తిగా దానిని రష్యాలో కలుపుకోవడమే లక్ష్యంగా పుతిన్ ఎత్తులు వేస్తున్నారు. Read: Electric Vehicles: నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు… అయితే, ఉక్రెయిన్‌కు నాటో, యూరప్‌తో పాటు అమెరికా సపోర్ట్ చేస్తున్నది. అమెరికా తన బలగాలను పోలెండ్‌కు పంపిన…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో పరిస్థితులు దిగజారాయి. రష్యాతో ఉన్న అన్ని రకాల సంబంధాలను ఉక్రెయిన్ తెగతెంపులు చేసేసుకున్నది. రెండు స్వతంత్ర దేశాలల్లో శాంతిని పరిరక్షించడం కోసం రష్యా తన సైన్యాన్ని ఆ రెండు దేశాలకు పంపింది. పదేళ్లపాటు రెండు దేశాల్లో రష్యా దళాలు ఉంటాయి. స్వతంత్ర ప్రాంతాలతో పాటు రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటుందనే సంకేతాలు…
స్టాక్ మార్కెట్లకు యుద్ధ భయం పట్టుకున్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్ని సందిగ్ద పరిస్థితులు మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గత నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు కుప్పకూలడంతో ఆందోళన మదుపురుల్లో ఆందోళన మొదలైంది సెన్సెక్స్ 382.91 పాయింట్ల నష్టపోయి 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు కోల్పోయి 17,092.20 పాయింట్ల వద్ద ముగిసింది. Read: Debate: పాక్ ప్రధాని బంపర్ ఆఫర్… మోడీతో…
ఉక్రెయిన్‌పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే…
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఏ క్షణంలో యుద్ధం సంభవిస్తుందో అని భయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులు చేసేందుకు మూడు వైపుల నుంచి సైన్యం రెడీగా ఉన్నది. యుద్దాన్ని నివారించేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, తాము ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమని రష్యా చెబుతున్నా పరిస్థితులు చూస్తుంటే ఏక్షణంలో దాడులు జరుగుతాయో అని భయపడిపోతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. Read: Corbevax: పిల్లల కోసం అత్యవసర అనుమతి… ఇక…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. బోర్డర్లో ఉక్రెయిన్ సైన్యం దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తుండగా, ఇదంతా ఫేక్ వార్తలని, తాము ఎలాంటి దాడులు చేయడం లేదని ఉక్రెయిన్ సైన్యం చెబుతున్నది. గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోవడంతో ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి అక్కడి మహిళలు తాము సైతం అంటూ యుద్ధ శిక్షణ తీసుకుంటున్నారు. యుద్ధం అనివార్యమైతే దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారు. Read: Moon:…
రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌కు మూడు వైపులా భారీ సంఖ్యలో రష్యా సైన్యం మోహరించింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేంగా కొందరు దేశం లోపల పనిచేస్తున్నారు. రష్యా అనుకూల వేర్పాటు వాదులకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్ణణలే దీనికి కారణమౌతున్నాయని పుతిన్ చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన సైన్యం కాల్పులు జరిపినట్లు రష్యా సైన్యం వెల్లడించింది. రాకెట్ లాంచర్లతో రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్ల దాడిలో రష్యా…