Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
FIFA Rejects Ukrainian President Zelensky's Peace Message: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు జరగుతున్నాయి. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును తన శాంతి సందేశం కోసం వేదిక చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్స్కీ భావించాడు. అయితే ఇందుకు ఫిఫా నిర్వాహకుల నో చెప్పినట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచుకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించాలని జెలన్స్కీ…
Russian Strikes Across Ukraine: ఉక్రెయిన్ పై భారీస్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. రాజధాని కీవ్ తో సహా దక్షిణాన ఉన్న క్రైవీ రిహ్, ఈశాన్యంలో ఉన్న ఖార్కీవ్ నగరాలపై దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది రష్యా. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల వల్ల ఖార్కీవ్ నగరంలో విద్యుత్ లేకుండా పోయింది. ఖార్కీవ్ లోొ మూడు దాడులు మౌళిక సదుపాయలే…
Ukraine's Volodymyr Zelenskyy is TIME Person of the Year: అత్యంత శక్తివంతమైన రష్యాను ధిక్కరించి యుద్ధంలో ఉక్రెయిన్ దేశాన్ని రష్యాకు ధీటుగా నిలబెట్టినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ఈ ఏడాది ‘‘టైమ్స్ పర్స్ ఆఫ్ ది ఇయర్’’గా ఎంపికయ్యారు. రష్యా యుద్ధంతో తన దేశాన్ని ఎదురొడ్డి నిలిచేలా చేసిన జెలన్ స్కీ ధైర్యాన్ని టైమ్స్ మ్యాగజీన్ ప్రశంసించింది. ధిక్కరణ, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఎదిగారని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతల్…
దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
Russia - Ukraine War : రష్యాకు యూరోపియన్ యూనియన్ షాకిచ్చింది. దీర్ఘకాలంగా ఉక్రెయిన్ దేశంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా విషయంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.
2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ' ఖేర్సన్ మాదే' అని ప్రకటించారు. దీనిని అమెరికా అసాధారణ విజయంగా ప్రశంసించింది.