ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని నీప్రో నగరంలో ఓ అపార్టుమెంట్‌పై రష్యా శనివారం జరిపిన దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది.
Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తుంది. రెండు వైపులా దాడుల్లో ఎంత నష్టపోతున్నా వెనక్కి తగ్గనంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని సోలెడార్ నగరాన్ని రష్యా ఆక్రమించింది.
పాశ్చాత్య శక్తులు ఆయుధాల సరఫరాను, ముఖ్యంగా సుదూర క్షిపణి వ్యవస్థలను పెంచినట్లయితే ఉక్రెయిన్ ఈ సంవత్సరం యుద్ధంలో విజయం సాధించగలదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ బుధవారం వెల్లడించారు.
కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు సరఫరాతో పాటు ఆర్థికంగా సహాయం అందిస్తున్నాయి.
Russian Ukrainian War: తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు భవనాలపై భారీ రాకెట్ తో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 600 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు హతమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
న్యూ ఇయర్ వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతీయ రాజధాని డొనెట్స్క్లోని జంట నగరమైన మాకివికాలోని వృత్తి విద్యా కళాశాలలో నాలుగు ఉక్రేనియన్ క్షిపణులు తాత్కాలిక రష్యన్ బ్యారక్‌లను తాకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Russo-Ukrainian War : గదిలో వేసి కొడితే పిల్లి కాస్త పులవుతుందని సామెత ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. చిన్న దేశాన్ని చేసి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోనే ఉంది.
Russia-Ukraine War: న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.
Russian air attack on Ukraine: కొత్త ఏడాదిలో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. మిసైళ్లు, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై సోమవారం తెల్లవారుజామున వరసగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కీవ్ పై వైమానిక దాడి..రాజధానిలో ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు షెల్టర్…