FATF: ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి సంబంధించి రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ శుక్రవారం తెలిపింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 200 కంటే ఎక్కువ దేశాలు, అధికార పరిధికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, తీవ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలను పరిష్కరించడానికి అధికారులకు సహాయం చేస్తుంది. మనీ లాండరింగ్‌ను ఎదుర్కునేందుకు విధానాలను అభివృద్ధి చేయడానికి జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ. తీవ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాలపై ఇది కఠిన ఆంక్షలు విధిస్తుంది.
Read Also: Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. ఈ కాష్టం చల్లారదా?
రష్యన్ ఫెడరేషన్ చర్యలు భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్ ప్రధాన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఎఫ్‌ఏటీఎఫ్ ప్రమాణాలను అమలు చేయడంలో రష్యా ఇప్పటికీ జవాబుదారీగా ఉందని పేర్కొంది. ప్యారిస్‌లో ఐదు రోజుల సమావేశం తరువాత ఎఫ్ఏటీఎఫ్ నైజీరియా, దక్షిణాఫ్రికాలను తన పర్యవేక్షణకు లోబడి ఉన్న దేశాల జాబితాలో చేర్చింది. కంబోడియా, మొరాకోలను ఎఫ్‌ఏటీఎఫ్ జాబితా నుంచి తొలగించింది.రష్యా కౌన్సిల్ ఆఫ్ యూరోప్ నుంచి బహిష్కరించబడింది. యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి కూడా సస్పెండ్ చేయబడింది. కానీ ఇప్పటికీ అనేక అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది.