రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం అనేక సమస్యలలో పాలుపంచుకుంది. ఆ దేశాల్లో నిరంతరం ఉద్రిక్తతలను తగ్గించడంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్‌పై రష్యా అణు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ నివారించారా? అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిచ్చారు.
ఉక్రెయిన్పై మరోసారి రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారమే రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణు యుద్ధం తప్పదంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులను ప్రయోగించింది.
అమెరికాకు మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది. కానీ ఈసారి మాత్రం రష్యా ఎన్నికల ముందు అగ్రరాజ్యం అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు మంచి ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాపై రష్యాకు వెళ్లారు. కానీ ఇప్పుడు వారు ఉక్రెయిన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ భారతీయులు రష్యా సైన్యంలో పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుల కుటుంబాలు ప్రభుత్వం సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై ఇటీవల రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్నారు.
రష్యాలో చాలా కాలంగా నివసిస్తున్న ఓ అమెరికన్ డ్యాన్సర్‌ను దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు 51 డాలర్లు (దాదాపు 4 వేల రూపాయలు) విరాళంగా ఇచ్చినట్లు ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి.
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం12 మంది లేబర్ పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడి నుండి స్థానిక ఏజెంట్ ఎక్కువ జీతం…
రష్యా నుంచి హెలికాప్టర్‌తో సహా ఉక్రెయిన్‌కు పారిపోయిన ఓ పైలట్ (Russian pilot) స్పెయిన్‌లో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వరంగ మీడియా వెల్లడించింది. పైలట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పేర్కొంది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నగరమైన అవ్దివ్కాపై మాస్కో పూర్తిగా నియంత్రణ సాధించిందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు.