Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.
Miracle Drug: క్యాన్సర్.. ఈ వ్యాధి వస్తే మరణమే అని తెలుసు. అయితే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం సరైన చికిత్స అందుబాటులో లేదనే చెప్పవచ్చు. క్యాన్సర్ చివరి దశల్లో ఈ వ్యాధి దేనికీ లొంగడం లేదు. అయితే క్యాన్సర్ వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా అట్టడుగు స్థానానికి వెళ్లాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ వివాదంపై స్పందించాయి. అమెరికా విచారణకు ఇండియా సహకరించాలని కోరింది.
UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. యూకేలో భారత రాయబారిగా ఉన్న విక్రమ్ దొరైస్వామిని గ్లాస్గో గురుద్వాలోకి వెళ్లకుండా ఖలిస్తానీ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారతదేశం, యూకేకి తన ఆందోళన తెలియజేసింది.
UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూకేలో రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ బ్రిటన్ లోని భారత రాయబారిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యూకే స్కాట్లాండ్ ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారత రాయబారి దొరైస్వామిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pink Pigeon: పావురాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటితో ఫోటోలు దిగాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అవి గుంపుగా ఉన్న చోటుకు వెళ్లి చాలా మంది వాటికి గింజలు కూడా వేస్తూ ఉంటారు. అవి ఒక్కసారిగి పైకి ఎగిరితే అప్పుడు వచ్చే ఫోటో కోసం చాలా మంది తంటాలు కూడా పడుతూ ఉంటారు. సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ప్రత్యక్ష్యమవుతున్న ఓ పావురం…
G20 Summit: జీ20 సమావేశాలకు దేశాధినేతలు తరలివస్తున్నారు. ఒక్కొక్కరుగా దేశాధినేతలు, కీలక వ్యక్తులు న్యూఢిల్లీకి చేరుకుంటుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు
G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది.
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు.
Rishi Sunak: బ్రిటన్, ఇండియాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరగా ముగించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అనుకున్నారు,