Norovirus: యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. గతేడాదడి ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం అధిక కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
బ్రిటన్‌లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు.
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ విచిత్రమైన పరిస్థితిని ఎదర్కొన్నారు. అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్ అయ్యారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే కూడా రిషి సునాక్‌తో కాసేపు బయటే ఉన్నారు. అక్కడ ఉన్న మీడియా అంతా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌గా మారింది. రిషి సునాక్, డచ్ ప్రధాని మార్క్ రొట్టేను అధికార నివాసం వెలుపల స్వాగతిస్తూ, మీడియాకు ఫోటోగ్రాఫ్ ఇచ్చారు.
Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది.
Laughing Gas: నైట్రస్ ఆక్సైడ్ సాధారణంగా "లాఫింగ్ గ్యాస్"గా పిలుస్తుంటారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. వినోద కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న దీన్ని బుధవారం నుంచి నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ డ్రగ్‌ని ఉత్పత్తి చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ గ్యాస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇదిలా ఉంటే భారత్ వియన్నా కన్వెన్షన్ ను ఉల్లంఘిస్తుందని కెనడా గగ్గోలు పెడుతోంది. అయితే దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూటిగా సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.
Viral news: మనిషి జీవితంలో పెళ్ళికి చాల ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కష్టసుఖాల్లో చివరి వరకు తోడుండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే. అయితే మనకి నచ్చిన వ్యక్తిని అన్నివిధాలా మనకి సరిపోయే వ్యక్తిని ఎపిక చేసుకోవడం కష్టం. అయితే తల్లిదండ్రులు చూసిన సంబంధాలను చేసుకుని కష్టమో నష్టమో కలిసిబ్రతికేవాళ్లు కొందరు, ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు కొందరు, స్నేహితులని వదిలి ఉండలేక ఒకే జెండర్ వ్యక్తుల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ…
Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.
Miracle Drug: క్యాన్సర్.. ఈ వ్యాధి వస్తే మరణమే అని తెలుసు. అయితే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం సరైన చికిత్స అందుబాటులో లేదనే చెప్పవచ్చు. క్యాన్సర్ చివరి దశల్లో ఈ వ్యాధి దేనికీ లొంగడం లేదు. అయితే క్యాన్సర్ వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.