Jihadi bride: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, కరుగుగట్టిన సిరియాలోని ఐఎస్ఐఎస్‌లో చేరిన బ్రిటీష్ యువతి తన పౌరసత్వాన్ని కోల్పోయింది. ఈ కేసును అక్కడి కోర్టులో ఛాలెంజ్ చేసిన సదరు యువతి, కేసును కోల్పోయింది. ‘జీహాదీ వధువు’గా పేరు పొందిన బ్రిటీష్ యువతి షమీమా బేగం పౌరసత్వం రద్దును కోర్టు సమర్థించింది. 15 ఏళ్ల వయసులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ఆకర్షితమైన షమీనా బేగం తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి సిరియా వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంది.
Yana Mir: భారత్‌లో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మైనారిటీలను అణిచివేస్తున్నారని, ఇండియన్ ఆర్మీ దురాగతాలకు పాల్పడుతోందని వెస్ట్రన్ మీడియాతో పాటు పాకిస్తాన్ ప్రేలాపనలను కాశ్మీరీ యువతి, హక్కుల కార్యకర్త యానా మీర్ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న ‘‘టూల్‌కిట్ ఫారిన్ మాడియా’’పై ఆమె విరుచుకుపడింది. బ్రిటన్ పార్లమెంట్‌లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది.
Ban on Mobile Phones in Classrooms Across UK: ప్రస్తుతం ప్రతిఒక్కరు మొబైల్స్ ఫోన్ వాడడం ఎక్కువైపోయింది. అవసరం లేకున్నా.. మొబైల్ ఫోన్ వాడుతూ గంటల తరబడి సమయం వెచ్చిస్తున్నారు. ఇంట్లోనే కాకుండా.. ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లలో కూడా ఫోన్ల వాడటం ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలు ఫోన్‌కు బానిసగా మారి.. చదువుపై దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రుషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేదించారు.…
Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించడంపై వెస్ట్రన్ దేశాలు పుతిన్‌పై భగ్గుమంటున్నాయి. శుక్రవారం నవల్నీ జైలులో మరణించారు. అతని మరణానికి రష్యా అధ్యక్షుడే కారణం అని.. పుతిన్ "కిల్లర్" అంటూ యూరప్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో ప్రజలు నినదించారు. యూరప్ లోని పలు నగరాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ముఖ్యంగా రష్యన్ ఎంబసీల ముందు నిరసన తెలిపారు. నవల్నీది మరణం కాదని హత్య అని ప్లకార్డ్స్…
UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యలకు పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్‌స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్‌నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్…
Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నదుల నుంచి కూడా జలాలను సేకరించారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి కూడా పవిత్ర జలాలు అయోధ్యకు చేరాయి. అయితే ఈ జలం నేరుగా పాక్ నుంచి భారత్‌కి రాలేదు.
UK: యూకేలో ఒక విచిత్రమై "గ్యాంగ్ రేప్" కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం జరిగినట్లు, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్చువల్ రియాలిటీ గేమ్‌లో 16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై బాలిక తీవ్ర మనోవేధన అనుభవిస్తున్నట్లు ది న్యూయార్క్ వార్తాసంస్థ నివేదించింది.
Bab el-Mandeb: ఇజ్రాయిల్-హమాస్ నేపథ్యంలో ఎర్ర సముద్రంతో పాటు అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన పలు ప్రాంతాల్లో యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, ఆ దేశంతో సంబంధం ఉన్న కార్గో నౌకలపై డ్రోన్లతో దాడులు జరుపుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.