UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నా నియోజకవర్గాన్ని విడిచిపెట్టినందుకు చాలా చింతిస్తున్నాను అని పదవికి రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ మాట్లాడారు. మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను..
British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్ (BA) ఐటీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. శుక్రవారం వరసగా రెండో రోజు డజన్ల కొద్దీ విమానాలను రద్దు చేసింది. ‘‘సాంకేతిక సమస్య నాక్ ఆన్ ఎఫెక్ట్’’ కారణంగా శుక్రవారం 42 విమానాలు రద్దయ్యాయి.
Rishi Sunak: ప్రపంచ భద్రతకు, శ్రేయస్సుకు చైనా అతిపెద్ద సవాల్ గా ఉందని, అయితే ఆదే సమయంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దాని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నించకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. జపాన్ లోని హిరోషిమా వేదికగా జీ-7 సమావేశాలకు ఆయన హజరయ్యారు.
SP Hinduja: హిందూజా గ్రూప్ సంస్థల అధినేత శ్రీచంద్ పర్మానంద్ హిందూజా(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం లండన్ లో కన్నుమూశారు.
Cost Of Living Crisis In UK: ఒకప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం సంభవించే ఛాన్స్ ఉన్న దేశాల్లో యూకే ముందు వరసలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు,
యూకేలో ఓ సంచలనాత్మక శాస్త్రీయ పద్ధతిలో ముగ్గుల వ్యక్తుల డీఎన్‌ఏతో సృష్టించబడిన మొదటి శిశువు జన్మించింది. ఈ ప్రక్రియలో 99.8శాతం డీఎన్‌ఏ ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వస్తుందని, మిగిలినది మహిళా దాత నుంచి వస్తుంది.
King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి బ్రిటన్ సిద్దం అయింది. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, రాజకుటుంబీకుల మధ్య ఈ రోజు ఆయన పట్టాభిషేకం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్ ఖడ్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కింగ్ ఛార్లెస్-3, ఆయన భార్య రాణి కెమిల్లా ధరించే కిరీటాలపై అందరి ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో మొత్తం మూడు కిరీటాలు ఉపయోగించనున్నారు. ఇందులో రెండు రాజుకు సంబంధించినవి కాగా..…
King Charles Grand Coronation Ceremony: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయింది. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల ప్రముఖులు లండన్ చేరుకున్నారు. భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్ శుక్రవారం లండన్ చేరుకున్నారు.…
Oral sex causes throat cancer: ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి.