Pigeon: పావురాలు ఈ కలర్ లో కూడా ఉంటాయా? చూస్తే షాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pink Pigeon: పావురాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటితో ఫోటోలు దిగాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అవి గుంపుగా ఉన్న చోటుకు వెళ్లి చాలా మంది వాటికి గింజలు కూడా వేస్తూ ఉంటారు. అవి ఒక్కసారిగి పైకి ఎగిరితే అప్పుడు వచ్చే ఫోటో కోసం చాలా మంది తంటాలు కూడా పడుతూ ఉంటారు. సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ప్రత్యక్ష్యమవుతున్న ఓ పావురం ఫోటో మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పావురం పింక్ కలర్ లో కనిపిస్తుంది. ఈ విచిత్రమైన పావురంయూకేలోని గ్రేట్ మాంచెస్టర్ వద్ద టౌన్ సెంటర్ సమీపంలో దర్శనమిచ్చింది. చాలా మంది రోడ్డుపై తిరుగుతూ రద్దీగా ఉన్న సమయంలోనే ఈ పక్షి కనువిందు చేసింది. అయితే మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురం అని ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనుకున్నారు. అయితే మొత్తం పరిశీలించాక అది పావురమే అని నిర్ధారించుకున్నారు అక్కడి ప్రజలు. దీంతో దానిని తెగఫోటోలు తీసుకున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పావురం సాధారణంగా పింక్ కలర్ లో ఉండదు. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో న్యూయార్క్ నగరంలో జెండర్ రివీల్ పార్టీలో అట్రాక్షన్ కోసం అని ఓ పావురానికి గులాబీ రంగు వేశారు. అయితే ఆ సమయంలో ఆ పావురం బంధింపబడి ఉంది. అయితే ఇక్కడ మాత్రం పావురం చాలా స్వేచ్ఛగా ఉంది. అందుకే ఇది నిజంగానే పింక్ కలర్ లో ఉన్న అరుదైన పావురమే అనిపిస్తుంది. అయితే దీనిని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఓ యూజర్ ఈ పావురాన్ని మీరు ఎక్కడైనా చూశారా? ఇది పింక్ కలర్ లో ఎందుకు ఉంది అంటూ రాసుకొచ్చాడు. దీనిని చూసిన చాలా మంది తాము కూడా ఇలాంటి పావురాన్ని మాంచెస్టర్ టౌన్ సెంటర్ సమీపంలోనే చూశామంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే అది ఎందుకు పింక్ కలర్ లో ఉంది అన్న విషయాన్ని మాత్రం ఎవరు తెలపలేదు.
Has anyone else seen this pink pigeon in Bury and does anyone know why it is pink?! #Bury #pinkpigeon #pigeon #pink #bird pic.twitter.com/wrx63R21TP
— Harriet Heywood (@Heywoodharriet_) September 9, 2023
- Tags
- Pink Pigeon
- UK
- viral photo
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..