UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. యూకేలో భారత రాయబారిగా ఉన్న విక్రమ్ దొరైస్వామిని గ్లాస్గో గురుద్వాలోకి వెళ్లకుండా ఖలిస్తానీ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారతదేశం, యూకేకి తన ఆందోళన తెలియజేసింది. ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణిస్తోంది. దొరైస్వామిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోందని యూకే మంత్రి మేరి ట్రెవెల్యన్ శనివారం అన్నారు. యూకేలోని అన్ని ప్రార్థనా మందిరాలు అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు.
Read Also: Vande Bharat Trains: ఇకపై 14 నిమిషాల్లోనే వందేభారత్ రైళ్లు శుభ్రం..
గ్లాస్గో గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన భారత రాయబారి దొరైస్వామినొ కొందరు ఖలిస్తాని మద్దతుదారులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొంత వాగ్వాదం జరిగింది. గురుద్వారా సిబ్బందిని కూడా వారు బెదిరించారు. అయితే ఎలాంటి అల్లరి జరగకుండా దొరైస్వామి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒకరు రాయబారి కారు డోర్ ని బలవంతంగా తీసేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. తమకు గ్లాస్గో ఆల్బర్ట్ డ్రైవ్ ప్రాంతంలో జరిగిన ఆందోళన గురించి సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 1.05 గంటలకు సమాచారం అందిందని దీనిపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.